హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు అరిగోస పడుతున్నారు. కరెంట్ లేక నీళ్లు రాక అష్టకష్టాలు పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం(Water shortage) మైళ్ల దూరం ప్రయాణించి తెచ్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. పండుగ పూట కూడా ఆడబిడ్డలు నీళ్ల కోసం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో( Jukkal Constituency) ఐదు రోజుల నుంచి మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీళ్లు రాకపోవడంతో, నీటి కోసం ట్యాంకర్ల దగ్గర జనం అవస్థలు పడుతున్నారు.
పండగ పూట ఇంట్లో చుట్టాలను వదిలి ఇలా నీళ్ల కోసం గంటలు, గంటలు ట్యాంకర్ల దగ్గర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఇలాంటి నీటి గోస రాలేదని ప్రజలు గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తాగు నీటి కష్టాలు తీర్చాలని ప్రజలు వేడుకుంటున్నారు.