గురువారం 28 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 19:35:17

రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

వనపర్తి :  నివర్‌ తుఫాన్ ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతివర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.  రైతులు రెండు రోజులపాటు పత్తి, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని కోరారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, పత్తి కొనుగోళ్లను త్వరగా  పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.

ధాన్యం, పత్తి తడవకుండా టార్పాలిన్లు , ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని,  జిల్లా, రీజినల్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు.  కొనుగోలు కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని,  ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo