నల్లగొండ : కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే కొనే నాథుడు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతుల కష్టం దళారుల పాలవుతున్నది. తాజాగా ధాన్యం కొనుగోలు చేయాలని నల్లగొండ(Nallagonda) జిల్లాలోని నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన(Farmers protest) చేపట్టారు. వేములపల్లి వద్ద రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మిల్లర్లు సిండికేట్గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆరోపించారు. మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.