Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదేశ 132 ఏండ్ల చరిత్రలో నాలుగేండ్ల విరామం తర్వాత తిరిగి ప్రెసిడెంట్ కాబోతున్న రెండో వ్యక్తిగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ట్రంప్ చివరి లెక్కింపు జరిగిన అరిజోనా (Arizona) రాష్ట్రంలోనూ పైచేయి సాధించారు. అంతేకాదు ఏకంగా ఏడు స్వింగ్ స్టేట్స్‌లోనూ ఆయన జయభేరి మోగించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చివరి ఫలితం కూడా ట్రంప్ వశమైంది. గ్రాండ్ కానియన్ స్టేట్ అయిన అరిజోనాలో 11 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా ట్రంప్ కైవసం చేసకున్నారు. దాంతో, అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ 312 ఎలక్టోరల్ ఓట్లు కొల్లగొట్టగా.. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్(Kamala Harris) 226 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితం అయింది.
Donald Trump will win Arizona, CNN projects. It completes his sweep of battleground states and brings his final electoral vote tally to 312. https://t.co/I2bmOABxch pic.twitter.com/WNI63VGq9k
— CNN (@CNN) November 10, 2024
ఈసారి అంచనాలకు మించి స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ హవా కొనసాగింది. ఈ స్టేట్స్లో ప్రధానమైన పెన్నిసిల్వేనియా, మిచిగాన్, విస్కోన్సిన్తో గెలుపొంది ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యం సాధించిన ట్రంప్ అరిజోనాలోనూ విజయంతో తన ప్రాబల్యాన్ని చాటారు.
అమెరికాకు రెండో దఫా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌లో ఆయన యూఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించారు.
BREAKING 🚨 Donald Trump stuns America with another MASSIVE rally in Swing State Arizona 🔥
Kamala cannot keep up with Donald Trump. He is going to win Arizona by a LANDSLIDE
LET’S FREAKING GO 🇺🇸 pic.twitter.com/fUDyS91Kag
— Marjorie Taylor Greene Press Release (Parody) (@MTGrepp) October 13, 2024
అయితే.. నాలుగేండ్ల తర్వాత డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓటమి పాలైన ట్రంప్ ఈసారి ప్రచారంలో దూకుడు కొనసాగించారు. బైడెన్ వైదొలగడంతో రేసులోకి వచ్చిన కమలా హ్యారిస్‌కు దీటుగా ప్రసంగాలు చేస్తూ.. డిబేట్లోనూ ఆమెపై ట్రంప్ పైచేయి సాధించారు. అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇస్తాను, యుద్ధాలను ఆపేస్తాను, వలసలను అడ్డుకుంటాను.. అనే నినాదాలతో బరిలోకి దిగిన ట్రంప్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విధంగా జయభేరి మోగించారు.