WTA Finals 2024 : అమెరికా టెన్నిస్ సంచలనం కొకో గాఫ్ (Coco Gauff) మరోసారి చరత్ర సృష్టించింది. చిన్నవయసులోనే డబ్ల్యూటీఏ ఫైనల్స్ (WTA Finals 2024) చాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నీలో ప్రపంచ స్థాయి క్రీడాకారిణులను ఓడించిన గాఫ్ టైటిల్ పోరులోనూ సత్తా చాటింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మారథాన్ మ్యాచ్‌లో చైనాకు చెందిన జెంగ్ క్విన్వెన్ (Zheng Qinwen)ను చిత్తు చేసింది. ట్రోఫీతో పాటు రూ.40 కోట్ల ప్రైజ్‌మనీ కొల్లగొట్టింది ఈ అమెరికా టీనేజర్.
డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో అరినా సబలెంక, ఇగా స్వియాటెక్ వంటి దిగ్గజాలను ఓడించి ఫైనల్ చేరిన అమెరికా యువ కెరటం ఫైనల్లోనూ రఫ్ఫాడించింది. తొలి సెట్ కోల్పోయిన గాఫ్ అనూహ్యంగా పుంజుకొని క్విన్వెన్కు చెక్ పెట్టింది. వరుసగా రెండు సెట్లతో జోరు చూపించి చివరకు 3-6, 6-4, 7-4తో టైటిల్‌ను కైవసం చేసుకుంది.
The perfect ending for @CocoGauff 🤩#WTAFinalsRiyadh | #PIF pic.twitter.com/TMXTtVP0ER
— wta (@WTA) November 9, 2024
దాంతో, 20 ఏండ్ల వయసులోనే డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో గెలుపొంది చాంపియన్‌గా నిలిచిన తొలి మహిళా ప్లేయర్‌గా గాఫ్ అరుదైన రికార్డు తన పేరిట రాసుకుంది. లెజెండరీ ప్లేయర్ సెరెనా విలియమ్స్ తర్వాత ఈ ఘతన సాధించిన రెండో అమెరికన్‌గా గాఫ్ చరిత్ర పుటల్లో నిలిచింది. 2013లో సెరెనా డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌గా రికార్డు లిఖించింది.
In great company 💜✨
Since the events inauguration in 1972 @CocoGauff becomes the fourth American to win the WTA Finals before turning 21, she joins @ChrissieEvert @TracyAustin_ and @serenawilliams! 💜#WTAFinalsRiyadh pic.twitter.com/8sVPbZNGMq
— wta (@WTA) November 9, 2024
‘నా అత్యుత్తమ ఆట ఆడాలని, ఎట్టిపరిస్థితుల్లోనే ఆశ కోల్పోవద్దని నిర్ణయించుకున్నా. ఈరోజు నేను అద్భుతంగా ఆడాను. అయితే.. ఫైనల్స్‌కు ముందు నేను దారుణంగా ఓడిపోతాననే వార్తలు విన్నాను. ఆ మాటలకు నేను బాధ పడలేదు. అవునా చూద్దాం అని అనుకున్నా. ఒక విషయం నిజాయతీగా చెబుతున్నా.. నా గురించి అలా మాట్లాడిన మనుషుల ఆలోచన తప్పు అని నిరూపించేందుకు ఈ విజయమే సాక్ష్యం. నేను కాదు నా రాకెట్ మాట్లాడుతుంది. ఈ విజయాన్ని మోటివేషన్‌గా తీసుకుంటా’ అని గాఫ్ మ్యాచ్ అనంతరం భావోద్వేగంతో మాట్లాడింది.
MAMBA MENTALITY ON FULL DISPLAY! 🐍👊@CocoGauff pulls off an epic comeback to defeat Zheng in a three set thriller and captures her first WTA Finals title! #WTAFinalsRiyadh pic.twitter.com/tkNWR5lx5P
— wta (@WTA) November 9, 2024
సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ తర్వాత అమెరికా టెన్నిస్‌లో సంచలనంగా మారిన గాఫ్.. 2023లో యూఎస్ ఓపెన్ విజేతగా చరిత్ర సృష్టించింది. అనంతరం 2024లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఇగా స్వియాటెక్‌ను చిత్తు చేసి మరో గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకుంది. తన ఆటతో అదరగొడుతున్న ఈ టీనేజరర్ ఇప్పటివరకూ 7 డబ్ల్యూటీఏ టూర్ సింగిల్స్ ట్రోఫీలు కొల్లగొట్టింది.