మహిళ అభివృద్ధే దేశాభివృద్ధికి నాంది : బీసీ నేత జూకంటి ప్రవీణ్ కుమార్
మహిళ అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజాపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో..
రాజాపేట, మార్చి 07 : మహిళ అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజాపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓ కె.నాగవేణితో పాటు మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్త్రీ జాతి ఉద్ధరణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వాటి అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. స్త్రీ, పురుష సమానత్వం కోసం ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. స్త్రీలపై దోపిడి, పీడన, అణిచివేత, వివక్షత లేని సమ సమాజ నిర్మాణం కోసం అంతా పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అడిషనల్ పీడీ సురేశ్, తాసీల్దార్ ప్రదీప్, ఎంపీఓ కిషన్, ఎంఈఎఫ్ జిల్లా నాయకుడు ఇంజ మహేశ్, మహిళ ఉద్యోగులు కె.సురేఖ, కె.సరస్వతి, వి.ఉపేంద్ర, జి.కవిత, వరిమడ్ల ఉపేంద్ర, ఉమ, మంగమ్మ, కార్యాలయ ఉద్యోగులు విజయ్ కుమార్, నరేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

