చుంచుపల్లి, ఆగస్టు 07 : ఆషాఢ మాసం సందర్భంగా గౌతంపూర్లోని శ్రీ కనకదుర్గ చంద్రమౌలీశ్వర దేవాలయంలో వేంచేసిన కనకదుర్గమ్మ అమ్మవారు శుక్రవారం శాకాంబరి అవతారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని సుందరంగా అలంకరించగా ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అదేవిధంగా పెనగడపలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో కూడా అమ్మవారికి శాకాంబరి అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతంపూర్ శ్రీ కనకదుర్గ చంద్రమౌలీశ్వర దేవాలయ అర్చకులు అనిల్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని వైభవంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. శాకాంబరి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

శాకాంబరి అవతారంలో కనకదుర్గమ్మ