6 Of Family Die In Fire | బకెట్‌తో ఒక ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి.. అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి
6 Of Family Die In Fire | ఒక వ్యక్తి తన చేతిలోని బకెట్‌తో ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. రెండు నిమిషాల తర్వాత ఖాళీ చేతులతో అక్కడి నుంచి వెళ్లాడు. ఆ వెంటనే ఆ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
బెంగళూరు: ఒక వ్యక్తి తన చేతిలోని బకెట్‌తో ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. రెండు నిమిషాల తర్వాత ఖాళీ చేతులతో అక్కడి నుంచి వెళ్లాడు. ఆ వెంటనే ఆ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. తొలుత షార్ట్ సర్క్యూట్ లేదా రిఫ్రిజిరేటర్ పేలుడు అగ్నిప్రమాదానికి కారణంగా పోలీసులు భావించారు. (6 Of Family Die In Fire) అయితే ఒక వ్యక్తి బకెట్‌తో ఆ ఇంట్లోకి వెళ్లడాన్ని సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించడంతో అతడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని బెళగావిలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 15న తెల్లవారుజామున 2 గంటల సమయంలో చావత్ వీధిలోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. గజానన్ డమోన్తో సహా ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు.
కాగా, ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ లేదా రిఫ్రిజిరేటర్ పేలుడు వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు తొలుత భావించారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. సెప్టెంబర్ 15న తెల్లవారుజామున 1.58 గంటలకు ఒక వ్యక్తి బకెట్ పట్టుకుని ఆ ఇంటి సమీపానికి వెళ్లాడు. రెండు నిమిషాల తర్వాత చేతిలో బకెట్ లేకుండా ఆ ప్రాంతం నుంచి అతడు తిరిగి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది.

Belagavi Houe Fie
మరోవైపు ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే ఆ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి మంటలు చెలరేగడంతో ఆరుగురు మరణించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు నిమిషాల్లో అక్కడ ఏం జరిగింది? ఆ ఇంట్లో అగ్నిప్రమాదం జరుగడానికి ఆ వ్యక్తికి ఏమైనా సంబంధం ఉన్నదా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. ఆ గుర్తుతెలియని వ్యక్తి ఎవరు? అగ్నిప్రమాదంలో మరణించిన ఆ కుటుంబ సభ్యులకు, అతడికి ఏమైనా సంబంధం ఉన్నదా? అన్నది ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తిని గుర్తించి అతడి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

