CSK CEO : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఆడడం ఖాయమైంది. ఊహించినట్టుగానే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఫ్రాంచైజీ మహీ భాయ్‌ను అన్క్యాప్డ్ ప్లేయర్‌గా అట్టిపెట్టుకుంది. దాంతో, మరో సీజన్లో ధోనీ మెరుపులు చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ, ధోనీ 18వ సీజన్‌తో ఐపీఎల్‌కు గుడ్ బై చెబుతాడనే వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ (Kasi Vishwanathan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ భవితవ్యం గురించి ఆయన ఏమన్నాడంటే..? ‘ధోనీకి సీఎస్కే అంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు. అందుకని అతడు ఆడాలనుకున్నంత కాలం సూపర్ కింగ్స్‌కు ఆడొచ్చు. అందుకు మేము ఏమాత్రం అడ్డుచెప్పం.
The Pack of Pride! 🦁
🌟 Rutu
⚡ Pathirana
🧨 Dube
⚔️ Thalapathy
🚁 Thala #UngalAnbuden #WhistlePodu 🦁💛 pic.twitter.com/wltTZHqUQr— Chennai Super Kings (@ChennaiIPL) October 31, 2024
అతడు సీఎస్కే తరఫున ఆడాలనుకున్నంతా కాలం మేము తలుపులు తెరిచే ఉంచుతాం. ఎందుకంటే ధోనీకి ఆట పట్ల ఉన్న అంకితభావం, పట్టుదల మాకు తెలసు. అతడు ఎల్లప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటాడని నేను నమ్ముతున్నా’ అని విశ్వనాథన్ వెల్లడించాడు.
18వ సీజన్ కోసం సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివం దూబేతో పాటు పేసర్ పథిరనలను అట్టిపెట్టుకుంది. ఇక మాజీ సారథి ధోనీని రూ.4 కోట్లకు అన్‌క్యాప్ట్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ మెగా వేలంలో ప్రతిభావంతులను కొని తమ స్క్వాడ్‌ను బలోపేతం చేసుకోవడంపై సీఎస్కే దృష్టి పెట్టింది. నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డా వేదికగా మెగా వేలం జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ పర్స్‌లో రూ.55 కోట్లు ఉన్న విషయం తెలిసిందే.