Phil Salt : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం ముంగిట ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (Phil Salt) మెరుపు సెంచరీ కొట్టాడు. 17వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తరఫున విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన సాల్ట్ ఈసారి వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన తొలి టీ20లో సూపర్ శతకంతో జట్టును గెలిపించాడు. దాంతో, ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌లో ఇంగ్లండో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
వన్డే సిరీస్ గెలుపొందిన వెస్టిండీస్‌కు తొలి పొట్టి పోరులో ఇంగ్లండ్ షాకిచ్చింది. 183 పరుగుల భారీ ఛేదనలో ఫిల్ సాల్ట్ (103) సెంచరీతో చెలరేగాడు. విండీస్ బౌలర్లను ఉతికేస్తూ సాల్ట్ వీరవిహారం చేశాడు. 54 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతడికి యువ కెరటం జాకబ్ బెథెల్(58) అర్ధ శతకంతో అండగా నిలవగా ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో బోణీ కొట్టింది.
Just made it look too easy 💪
Phil Salt, that was spectacular! 🧊
🌴 #WIvENG 🏴 | #EnglandCricket pic.twitter.com/ttVDE6wWTb
— England Cricket (@englandcricket) November 10, 2024
తొలుత ఆడిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. వికెట్ కీపర్ నికోలస్ పూరన్(38), రస్సెల్(30), రొమారియో షెపర్డ్(35).. ఆఖర్లో గుడకేశ్ మోతీ(33)లు రాణించగా విండీస్ భారీ స్కోర్ చేయగలిగింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 నవంబర్ 12న జరుగనుంది.