నిర్మల్ : రాష్ట్రంలో రైతులు ఆందోళనలు(Farmers protest) కొనసాగుతూనే ఉన్నాయి. పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై బైఠాయిస్తున్నారు. తాజాగా నిర్మల్(Nirmal )జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన దాదాపు 200 మందికి పైగా రైతులు ధాన్యం కొనుగోళ్ళు చేపట్టాలని గురువారం ఆందోళనకు దిగారు.
నిర్మల్ – బైంసా ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. గా, రైతుల ఆందోళనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట