గిరాకీ లేక.. కిస్తీలు కట్టలేక మనస్తాపంతో.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య
అప్పుల బాధతో ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్ నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ షుకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కుండె శ్రీనివాస్ (40) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
- వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో విషాదం
వరంగల్‌చౌరస్తా, మార్చి 18: అప్పుల బాధతో ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్ నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ షుకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కుండె శ్రీనివాస్ (40) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఏడు నెలల క్రితం ఆటో కొనుగోలు చేశాడు. గిరాకీ లేకపోవడంతో నెలవారీగా కిస్తీలు చెల్లింపునకు సైతం ఇబ్బందులు పడుతున్నాడు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపానికి గురైన శ్రీనివాస్ మంగళవారం రాత్రి వరంగల్ బస్‌స్టాండ్ సెంటర్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన స్థానికులు బాధితుడిని 108 వాహనంలో ఎంజీఎంహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 11.30 గంటలకు మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

