మంథని, ఆగస్టు 8: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ముత్యాలమ్మవాడకు చెందిన ఎనగందుల శశాంక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) ముంబైలో మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎండిజైన్) కోర్సులో దేశవ్యాప్తంగా జరిగిన ప్రవేశ పరీక్షలో కామన్ మెరిట్ ర్యాంక్- 410, కేటగిరీ మెరిట్ ర్యాంక్-24(ఎస్సీ) సాధించాడు. శశాంక్ తండ్రి శంకర్, తల్లి జయసుధ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.లక్షల్లో ఖర్చయ్యే ఈ విద్యను భరించే స్థితిలో శశాంక్ కుటుంబసభ్యులు లేక తల్లడిల్లుతున్నారు. దేశంలో కొందరికి మాత్రమే దొరికే అరుదైన అవకాశం రావడం, లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడంతో సీటు వదులుకోవాల్సి వస్తుందేమోనని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతూ దాతల సహకారం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయం చేసే దాతలు 9652033021, 8008214442లో సంప్రదించాలని కోరారు.