తరచుగా లాంగ్ డ్రైవ్స్ వెళ్లేవారికి.. వాహనాల టైర్లలో గాలి తగ్గుతుంటుంది. మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇలాంటి సమస్య ఎదురైతే.. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే, ఈ Portronics Vayu Nano వెంట తీసుకెళ్తే.. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగే డిజిటల్ టైర్ ఇన్‌ఫ్లేటర్ ఇది. వాహనాల టైర్లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనిపై ఉండే ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా.. టైర్లో ప్రస్తుతం ఎయిర్ ప్రెజర్ ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఇక దీని ద్వారా గాలి ఎక్కించడం కూడా చాలా ఈజీ. మనకు కావలసిన ప్రెజర్ సెట్ చేసి ఆన్ చేస్తే.. ఆ స్థాయికి గాలి రాగానే ఆగిపోతుంది. దీనివల్ల టైర్లో ఎక్కువ గాలి నిండే ప్రమాదం ఉండదు. రాత్రి వేళల్లో, చీకటిగా ఉన్న రోడ్లపై గాలి పట్టుకోవడానికి వీలుగా ఇందులో ఒక ఇన్‌బిల్ట్ టార్చ్ లైట్ కూడా ఉంటుంది. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది.
ధర: రూ.2,800
దొరుకుచోటు: అమెజాన్

మొబైల్ ఆడియో ప్రియుల కోసం ఫోజీ సంస్థ ప్రీమియం పోర్టబుల్ ఆడియో డివైజ్‌ను తీసుకొచ్చింది. హైరెజల్యూషన్ సౌండ్ క్వాలిటీని అందిస్తూ.. Fosi Audio MD3 Magnetic DAC Amp Dongleను రూపొందించింది. ఈ డాంగిల్ ప్రత్యేకత.. దీని మాగ్నెటిక్ డిజైన్. ఐఫోన్లలో ఉండే MagSafe టెక్నాలజీ లాగా, ఇది మీ ఫోన్ వెనుక భాగానికి అయస్కాంతంలా అతుక్కుపోతుంది. దీనివల్ల ఫోన్ వాడుతున్నప్పుడు, జేబులో పెట్టుకున్నప్పుడు సాధారణ డాంగిల్స్లాగా కిందకి వేలాడదు. ఫోన్‌తోపాటే కలిసిపోయి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో హై ఎండ్ డిజిటల్-టు-అనలాగ్ కన్వర్టర్ చిప్‌ను ఉపయోగించారు. ఇది డిజిటల్ ఆడియో ఫైల్స్‌ను ఎటువంటి లాస్ లేకుండా స్పష్టమైన అనలాగ్ సౌండ్‌గా మారుస్తుంది. అన్నిరకాల హై-రెజల్యూషన్ ఆడియో ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మ్యూజిక్‌లో ఉండే ప్రతి చిన్న ఇన్స్ట్రుమెంట్ సౌండ్ బేస్, వోకల్స్ చాలా క్లియర్‌గా వినిపిస్తాయి. ఏవియేషన్-గ్రేడ్
అల్యూమినియం బాడీతో తయారు చేయడం వల్ల చాలా మన్నికగా ఉంటుంది.
ధర: రూ.16,999,
దొరుకుచోటు: అమెజాన్

కారు ప్రయాణాలను సురక్షితంగా రికార్డ్ చేయడానికి అందరూ డ్యాష్ కెమెరాలు వాడుతుంటారు. అయితే, ఇవి ముందు వైపు మాత్రమే రికార్డ్ చేస్తాయి. అందుకే, డ్రైవింగ్‌కు అదనపు భద్రతను పెంచుతూ.. Bebird 360 Degree Dash Camera with Night Vision మార్కెట్లోకి వచ్చింది. ఈ 360 డిగ్రీ కెమెరా.. కారు చుట్టూ జరిగే ప్రతి దృశ్యాన్నీ క్యాప్చర్ చేస్తుంది. కారు ముందు-వెనుక భాగాలతోపాటు క్యాబిన్, కిటికీల వైపు కూడా కవర్ చేస్తుంది. దీనివల్ల రోడ్డుపై జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్ వివాదాలే కాకుండా, కారు లోపల జరిగే మూమెంట్స్, కారు పక్కన ఎవరైనా స్క్రాచ్ చేయడానికి ప్రయత్నించినా స్పష్టంగా రికార్డ్ అవుతుంది. రాత్రి వేళల్లో, వెలుతురు చాలా తక్కువగా ఉండే రోడ్లపై కూడా క్లియర్ విజువల్స్ అందించడానికి ఇందులో నైట్ విజన్ సెన్సర్లను ఉపయోగించారు. ఈ డ్యాష్ క్యామ్ ఇన్‌బిల్ట్ వైఫైతో వస్తుంది. మీరు స్మార్ట్‌ఫోన్‌లో దీనికి సంబంధించిన యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, వీడియోలను నేరుగా ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ధర: రూ.16,990,
దొరుకుచోటు: అమెజాన్

మీ ఆఫీస్ డెస్క్‌కు వింటేజ్ థీమ్‌ను జోడించాలని అనుకుంటున్నారా? అదే సమయంలో ఆధునిక టెక్నాలజీని కూడా కోరుకుంటున్నారా? అయితే, XECH Retro Typewriter Wireless Keyboardపై ఓ లుక్కేయండి. పాతకాలపు టైప్‌రైటర్‌లా కనిపించే ఈ ఆధునిక కీబోర్డ్.. మీ డెస్క్ సెటప్‌ను అందంగా మార్చేస్తుంది. ఇందులో పాతకాలపు మెకానికల్ టైప్రైటర్లలో ఉండే గుండ్రటి కీస్ ఉంటాయి. టైప్ చేస్తున్నప్పుడు విలక్షణమైన అనుభూతిని అందిస్తాయి. కీబోర్డ్ పైభాగంలో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్‌ను ఉంచడానికి ఒక ప్రత్యేకమైన స్లాట్ ఉంటుంది. దీనివల్ల అదనపు స్టాండ్ అవసరం లేకుండానే ఫోన్, ఐపాడ్‌ను మినీ ల్యాప్‌టాప్‌లా మార్చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా ఒకేసారి మూడు పరికరాలకు కనెక్ట్ అవుతుంది. ఇది విండోస్, మ్యాక్ ఓఎస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ లాంటి అన్ని ముఖ్యమైన ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను సపోర్ట్ చేస్తుంది.
ధర: రూ.1,900
దొరుకుచోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్