నిరుద్యోగ యువతి బలవన్మరణం.. ఖమ్మం జిల్లాలో విషాదం
ఉద్యోగం రాదేమోనన్న బెంగతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తెల్దార్‌పల్లిలో బుధవారం చోటుచేసుకున్నది.
- ఉద్యోగం రాదేమోననే బెంగతో అఘాయిత్యం
ఖమ్మం రూరల్, మార్చి 18 : ఉద్యోగం రాదేమోనన్న బెంగతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తెల్దార్‌పల్లిలో బుధవారం చోటుచేసుకున్నది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. తెల్దార్‌పల్లికి చెందిన ఉన్నం భవాని(25) పీజీ వరకు చదువుకున్నది. కొంతకాలంగా ఇంటి దగ్గరే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోడంతో ఇక తనకు ఉద్యోగం రాదేమోననే బెంగతో తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో మంగళవారం ఉదయం ఇంట్లో గడ్డిమందు తాగింది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమించిందని, ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. చేసేదేమీలేక కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

