Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ ఫాంలోకి వస్తాడు.. రాబోయే రోజుల్లో కప్ మనదే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. తుర్కయాంజల్ జేబీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఇది 8 పర్సంట్ గవర్నమెంట్.. బిల్లులు ఇవ్వాలంటే 8 పర్సంట్ ఇవ్వాలట అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను పెట్టుబడులకు స్వర్గధామం చేసిండు కేసీఆర్. ఇగురం లేనోడు వ్యవసాయం చస్తే వడ్లు వాగు పాటు, గడ్డి గాలి పాలయ్యిందట. రేవంత్ రెడ్డి పాలన కూడా అట్లున్నది అని హరీశ్‌రావు విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఫీల్డింగ్, బౌలింగ్, కీపింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నది. క్రికెట్లో 11 మంది లాగే మంత్రులు 11 మంది ఉన్నారు. బీఆర్ఎస్ గట్టిగ పోరాటం చేస్తున్నది కాబట్టే పెవిలియన్ దారి పడుతున్నరు. రాబోయే రోజుల్లో మనదే కప్. కేసీఆర్ ఫుల్ ఫాంలోకి వస్తడు. మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తాడు. కేసీఆర్ ఎక్కడ ఉన్నావు అని యాది చేసే కాలం వచ్చింది. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా తగ్గించి క్రికెట్, ఫుట్ బాల్, వాలీ బాల్ ఆడండి, శారీరక శ్రమ చేయండి. ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్ కోసం క్రీడలు ఉపయోగపడతాయి. సోషల్ మీడియా తగ్గించి ఆటలు, చదువు మీద దృష్టి పెట్టండి అని యువతకు హరీశ్‌రావు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఆరు గ్యారెంటీల అమల్లో రేవంత్ రెడ్డి డకౌట్.. విమర్శించిన హరీశ్‌రావు
Harish Rao | తెలంగాణ అమరవీరుల గురించి ఆలోచించేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే : హరీశ్‌రావు
Lagcherla | మా ఇంట్లోనే భయపడుతూ బతుకుతున్నాం.. లగచర్ల బాధితుల ఆవేదన
DK Aruna | ఫార్మా కంపెనీపై ఎందుకంత ప్రేమ.. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ డీకే అరుణ