Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి డకౌట్ అయ్యారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. పేదోళ్ల ఇండ్లు కూలగొట్టడమే రేవంత్ హిట్ వికెట్ అని పేర్కొన్నారు. తుర్కయాంజల్ జేబీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
గెలిచిన టీం కాదు, ఓడిపోయిన టీం కూడా బాగా ఆడారు. గెలుపోటములు చాలా సహజం. భవిష్యత్తులో గెలుపు కోసం పోరాటం చేయాలి. ఆరు గ్యారెంటీలు బంద్ పెట్టి మూసీ దుకాణం మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి. 31 ఎస్టీపీలు, రూ. 3800 కోట్లతో మూసీ అభివృద్ధిని కేసీఆర్ ప్రారంభించాడు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లను రూ. 1100 కోట్లతో మూసీలో పోయాలని ప్లాన్ చేశారు. మూసీ శుద్ధి చేయాలంటే గోదావరి నీళ్లు తేవాలి. అంతేగాని గరీబోళ్ల ఇల్లు కూలగొట్టడం కాదు. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే బీఆర్ఎస్ ఊరుకోదు అని హరీశ్‌రావు హెచ్చరించారు.
ఆరు గ్యారెంటీలు అన్నడు మోసం చేసిండు. పింఛన్లు, విద్య భరోసా కార్డు, ఉద్యోగాలు ఏవీ లేవు. ఇప్పటి వరకు ఒక్క విద్యార్థికి కూడా స్కాలర్షిప్స్ డబ్బులు ఇవ్వలేదు. డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం రూ. 20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. ఏడాది అవుతున్నది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రేవంత్ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | తెలంగాణ అమరవీరుల గురించి ఆలోచించేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే : హరీశ్‌రావు
Lagcherla | మా ఇంట్లోనే భయపడుతూ బతుకుతున్నాం.. లగచర్ల బాధితుల ఆవేదన
DK Aruna | ఫార్మా కంపెనీపై ఎందుకంత ప్రేమ.. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ డీకే అరుణ