Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ అమరవీరుల గురించి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆలోచిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, పది లక్షలు ఇచ్చి అమరులను గౌరవించింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మాత్రమే అని తేల్చిచెప్పారు. తుర్కయాంజల్ జేబీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ అమరవీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఏటా నిర్వహిస్తున్న ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ నాయకుడు నర్సింగరావుకు అభినందనలు. అమరుల త్యాగం, విద్యార్థులు, కేసీఆర్ కృషి ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలవడానికి కేసీఆరే కారణం. ఐటీ, ఆర్థికం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో కేసీఆర్ నెంబర్ వన్‌గా నిలిపారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
పదేళ్లలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను 11 నెలల పాలనలో రేవంత్ రెడ్డి అధ:పాతాళానికి తీసుకెళ్లాడు. హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కుల సముద్రం అంటడు, దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు అమ్ముతడు అంటడు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట. ఇట్ల మాట్లాడుతారు రేవంత్ రెడ్డి. సీఎం మాటలు విని పరీక్షల్లో రాస్తే ఆగమైపోతరు. రాష్ట్రం పరువు తీస్తున్నడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
బాధితులకు ఉరిశిక్ష పడుతుందని సీఎం సోదరుడు బెదిరిస్తున్నాడు.. మండిపడ్డ సత్యవతి రాథోడ్
Lagcherla | మా ఇంట్లోనే భయపడుతూ బతుకుతున్నాం.. లగచర్ల బాధితుల ఆవేదన
DK Aruna | ఫార్మా కంపెనీపై ఎందుకంత ప్రేమ.. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ డీకే అరుణ