Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతును రాజు చేశారు. దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రెండు దఫాలుగా పంటల రుణమాఫీ చేశారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతుకు, అతని కుటుంబానికి ఆర్థిక భరోసా నింపారు. కొత్త ప్రాజెక్టులతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించి రైతులకు కరెంట్ కష్టాల నుంచి విముక్తి చేశారు. వీటన్నింటితో పాటు మరిన్ని రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి.. రైతులను రాజులుగా తయారు చేశారు కేసీఆర్.
కానీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతులు అరిగోస పడుతున్నారు. లక్ష రూపాయాల వరకు రుణమాఫీ అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. చివరకు లక్ష వరకు రుణాలున్న చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో రేవంత్ సర్కార్‌పై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రేషన్ కార్డు లేదని చాలా మందికి రుణాలు మాఫీ చేయలేదని సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ హయాంలో సాగుకు స్వర్ణయుగం.. లక్ష కోట్లకు పైగా సంక్షేమం జరిగిందని తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతన్నకు నేరుగా లక్షల కోట్ల రూపాయాల ఆర్థిక సాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు.
రైతుభంధు పథకం కింద 69 లక్షల మంది రైతులకు రూ. 72,972 కోట్లు అందించారు. 11 వేల మంది రైతు కుటుంబాలకు రైతుబీమా కింద రూ. 6,488 కోట్లు అందజేశారు. రెండు దఫాల్లో రూ. 29,144.61 కోట్ల రుణమాఫీ చేశారు. ఇతర రైతు సంక్షేమ పథకాల కింద రూ.11.401 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం ఈ పథకాల ద్వారానే రైతులకు అందిన ఆర్థిక సాయం రూ. 1,20,005 కోట్లు.. దేశ చరిత్రలో ఇది ఆల్ టైం రికార్డ్ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
🌾సాగుకు స్వర్ణయుగం..
🌾లక్షకోట్లకు పైగా సంక్షేమం..తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పాలనలో రైతన్నకు నేరుగా అందించిన ఆర్థికసాయం
🌾69 లక్షల రైతులకు రూ. 72,972 కోట్ల రైతు బంధు
🌾లక్షా 11 వేల మందికి రూ. 6,488 కోట్ల రైతుబీమా
🌾రెండు దఫాల్లో రూ. 29,144.61 కోట్ల రుణమాఫీ
🌾ఇతర రైతు… pic.twitter.com/nnePCjwnGL
— Harish Rao Thanneeru (@BRSHarish) July 19, 2024
ఇవి కూడా చదవండి..
Telangana | ఆర్థిక శాఖలో పని విభజన.. స్పెషల్ సీఎస్ రామకృష్ణారావుకు పని భారం తగ్గింపు..!
Group-2 | నిరుద్యోగులకు తలవంచిన రేవంత్ సర్కార్.. గ్రూప్-2 డిసెంబర్‌కు వాయిదా
KTR | చారాణ కోడికి.. బారాణ మసాలా..! కాంగ్రెస్ రుణమాఫీపై కేటీఆర్ సెటైర్లు