KTR | హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న లక్ష రూపాయాల వరకు రుణమాఫీ చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. లక్ష రూపాయాల వరకు రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించినప్పటికీ.. ఆ లోపు రుణాలు ఉన్న చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటల రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. రేవంత్ సర్కార్ పంటల రుణమాఫీ చూస్తుంటే చారాణ కోడికి.. బారాణ మసాలా.. అనే సామెత గుర్తుకు వస్తుందని కేటీఆర్ విమర్శించారు.
రుణమాఫీ అయిన రైతుల కన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు.. రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలు అయ్యాయని తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉన్న సమయంలో ఈ సంబురాలు ఎందుకు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. మభ్యపెట్టే మీ పాలన గురించి.. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్..! ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్..!! అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.
సీఎం గారు…
ఊరించి.. ఊరించి..
ఏడునెలలు ఏమార్చి చేసిన..మీ రుణమాఫీ తీరు చూస్తే..
తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే..“ చారాణ కోడికి..! బారాణ మసాలా…!! ”
రుణమాఫీ అయిన రైతులకన్నా..
కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!
రైతుమాఫీ…— KTR (@KTRBRS) July 19, 2024
ఇవి కూడా చదవండి..
Heavy Rains | నేడు ఆ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు