Palla Rajeshwar Reddy | రైతులకు కేసీఆర్ ఆనందాన్నిస్తే.. కాంగ్రెస్ ఆందోళన మిగిల్చింది: ఎమ్మెల్యే పల్లా
రైతులకు కేసీఆర్ ఆనందాన్నిస్తే.. కాంగ్రెస్ ఆందోళన మిగిల్చిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని విమర్శించారు.
హైదరాబాద్: రైతులకు కేసీఆర్ ఆనందాన్నిస్తే.. కాంగ్రెస్ ఆందోళన మిగిల్చిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని విమర్శించారు. ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నా హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. రైతులకు కాంగ్రెస్ చేసింది గోరంత.. కొండంతలుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు వివేకానంద, కోవాలక్ష్మితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో మొదటి విడుతలో 35 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్లు చెల్లించామన్నారు. ఆంక్షల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీని కొందరికే పరిమితం చేసిందని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. రైతుభరోసా కింద రైతులకు వెంటనే పెట్టుబడిసాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. కాంగ్రెస్ నేతల సంబురాల్లో సిద్దిపేట కలెక్టర్ పాల్గొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆర్ మాత్రమేనని వెల్లడించారు. రైతుబంధు కింద కేసీఆర్ రూ.70 వేల కోట్లు ఇచ్చారని గుర్తుచేశారు. 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని కేసీఆర్ హయాంలో రైతులు పండించారని తెలిపారు. రైతులకు కేసీఆర్ ఆనందాన్నిస్తే.. కాంగ్రెస్ ఆందోళన మిగిల్చిందని విమర్శించారు. కేసీఆర్ కట్టించిన రైతు వేదికల్లో కాంగ్రెస్ సంబురాలు చేసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు బూతులు తప్ప రైతులపై శ్రద్ధలేదని విమర్శించారు.
సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ఏం చేశారో రైతులకు తెలుసని వెల్లడించారు. కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కోవాలక్ష్మి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి అభివృద్ధికి ఒక్క పైసా రాలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సీఎంలా వ్యవహరించాలి తప్ప.. పీసీసీ అధ్యక్షుడిగా కాదన్నారు. కేసీఆర్ హయాంలో అందరు ఎమ్మెల్యేలను ఒకేలా చూశారని గుర్తుచేశారు.
LIVE : BRS Leaders Press Meet at Telangana Bhavan@PRR_BRS @kp_vivekanand https://t.co/6QCuihjdY1
— BRS Party (@BRSparty) July 19, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

