ఢిల్లీ: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లో జరుగుతున్న ప్రేగ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో డిఫెండింగ్ చాంపియన్ అరవింద్ చిదంబరం గెలుపు బోణీ కొట్టాడు. తొలి రౌండ్లో ఓడిన చిదంబరం.. రెండో రౌండ్లో హ్యాన్స్ నీమన్‌పై విజయం సాధించాడు.
నల్లపావులతో ఆడిన అతడు.. 31 ఎత్తుల్లో గేమ్‌ను ముగించాడు. ఇదే టోర్నీ బరిలో ఉన్న వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్.. రెండో రౌండ్లో నొదిర్బెక్ (ఉజ్బెకిస్థాన్)తో గేమ్‌ను 30 ఎత్తుల తర్వాత ఇద్దరూ డ్రాగా ముగించారు.