సీఎంగా డీకే ఎప్పుడు?… గందరగోళానికి తెరదించండి అధిష్ఠానానికి మద్దతుదారుల విజ్ఞప్తి
కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు మరింత ఉధృతమైంది. ఓ హోటల్లో సమావేశమైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు.. తమ నాయకుడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
బెంగళూరు, ఫిబ్రవరి 27: కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు మరింత ఉధృతమైంది. ఓ హోటల్లో సమావేశమైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు.. తమ నాయకుడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. శివకుమార్ అనుచరుడు, మగది ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఓ హోటల్లో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారని, శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు లాబీయింగ్ చేయాలని నిర్ణయించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ఇదేవిధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలవడం అసాధ్యం.
నాయకత్వ మార్పిడి విషయమై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించాం’ అని వెల్లడించారు. ‘హైకమాండ్ నిద్రపోవడం లేదు.. కర్ణాటకలో ఏం జరుగుతున్నదో వారికి అన్నీ తెలుసు’ అని అన్నారు. తమ నియోజకవర్గాలలోని ప్రజలు, కార్యకర్తలు రాష్ట్రంలో నాయకత్వం మార్పిడిని కోరుకుంటున్నారని చెప్పారు. ‘సీఎంను మారుస్తారా? లేక పీసీసీ అధ్యక్షుడిని మారుస్తారా అన్నది హైకమాండ్ ఇష్టం. ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని అధిష్ఠానం చెప్పలేదా? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఈ గందరగోళానికి తెరదించాలి’ అని స్పష్టంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

