Heavy Rains | నేడు ఆ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అదేవిధంగా భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలో భారీ వానలు పడుతాయని వెల్లడించింది.
హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అదేవిధంగా భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలో భారీ వానలు పడుతాయని వెల్లడించింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈనేపథ్యంలో ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
అదేవిధంగా శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీగా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు వర్షం కురుస్తుందని హెచ్చరించింది.
పెద్దవాగుకు పొంచిఉన్న ప్రమాదం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగుకు వరద ఉధృతి పెరిగింది. దీనికితోడు పైనున్న కొండలు, గుట్టలపై నుంచి కూడా వరద ప్రాజెక్టులోకి చేరడంతో స్థాయికి మించి జలాలు రావడం వల్ల వాగు కట్టకు రెండుచోట్ల గండి పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతంలో ఉండే గుమ్మడవల్లి గ్రామంలోని 300 కుటుంబాలు, కొత్తూరు గ్రామంలోని 200 కుటుంబాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టుకు రెండుచోట్ల గండిపడిన దృష్ట్యా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలిసే పరిస్థితి లేదని ఆయా గ్రామాల ప్రజలకు వివరించారు.
పోలీసు, రెవె న్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని అంచనా వేయడంతోపాటు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. అయితే ప్రాజెక్టు వరద నీరు దిగువకు వెళ్తుండటంతో ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం గుళ్లవాయి, మాధారం, రెడ్డిగూడెంతోపాటు మరో నాలుగు గ్రామాల ప్రజలను అక్కడి అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీరంతా ఆయా గ్రామాల మీదుగా రుద్రంకోట వద్ద గోదావరిలో కలుస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bhadardri
- Heavy Rains
- IMD
- khammam
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

