Group-2 | నిరుద్యోగులకు తలవంచిన రేవంత్ సర్కార్.. గ్రూప్-2 డిసెంబర్‌కు వాయిదా
Group-2 | నిరుద్యోగుల ఉద్యమానికి రేవంత్ సర్కార్ తలవంచింది. ఎట్టకేలకు గ్రూప్-2 ఎగ్జామ్‌ను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్-2 రాతపరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
Group-2 | హైదరాబాద్ : నిరుద్యోగుల ఉద్యమానికి రేవంత్ సర్కార్ తలవంచింది. ఎట్టకేలకు గ్రూప్-2 ఎగ్జామ్‌ను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్-2 రాతపరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్లో నిర్వహించనున్న గ్రూప్-2 రాతపరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు.
గ్రూప్-2 వాయిదాతో పాటు పోస్టుల సంఖ్య పెంచాలని గత నెల రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేశారు. నిరసనలు, ఆందోళనల్లో పాల్గొన్న నిరుద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపి లాఠీలు ఝుళిపించారు.
ఇటీవలే అశోక్‌నగర్‌లో అర్థరాత్రి వేళ భారీ నిరసన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తెలంగాణ సచివాలయం ముట్టడికి కూడా నిరుద్యోగులు పిలుపునివ్వడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మొత్తానికి నిరుద్యోగుల ఉద్యమం ఫలించింది.
పోస్టోపోన్ వరకేనా..? పోస్టులు పెంచుతారా..?
మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వాయిదాతో పాటు పోస్టులు కూడా పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2 వేల పోస్టులు అదనంగా పెంచాలని నిరుద్యోగుల డిమాండ్. మరి పోస్టులు పెంచుతారా..? లేదా అనే దానిపై అనుమానం ఉందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | చారాణ కోడికి.. బారాణ మసాలా..! కాంగ్రెస్ రుణమాఫీపై కేటీఆర్ సెటైర్లు
Heavy Rains | నేడు ఆ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

