సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) జిల్లాలో రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బస్సులు, (Busses)ఓ డీసీఎం ఢీ కొన్న ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నాలుగు బస్సులు, డీసీఎం వాహనం ఢీ కొన్నాయి. ముందు వెళ్తున్న బస్సు ఆగడంతో వెనుక నుంచి వచ్చిన వాహనాలు బస్సును ఢీ కొట్టాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరి గాయాలవ్వగా 80 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Swag Twitter Review | వన్ మ్యాన్ షోలా శ్రీవిష్ణు స్వాగ్.. ఇంతకీ నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3