Swag Twitter Review | కథను బలంగా నమ్మి సినిమాలు చేసే యాక్టర్లలో ముందువరుసలో ఉంటాడు టాలీవుడ్ యాక్టర్ శ్రీ విష్ణు (Sree Vishnu). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన తాజా చిత్రం స్వాగ్ (SWAG). పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ, దక్షా నగార్కర్, మీరా జాస్మిన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. శ్రీవిష్ణుతో రాజ రాజ చోర లాంటి హిట్ సినిమా తర్వాత మరోసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు హసిత్ గోలి.
చారిత్రక నేపథ్యం ఉన్న స్వాగణిక వంశంతో స్త్రీ గొప్పా? పురుషుడు గొప్పా? అనే అంశాన్ని టచ్ చేస్తూ సాగే ఈ సినిమాపై నెటిజన్లు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నెట్టింట టాక్, రివ్యూస్‌పై ఓ లుక్కేస్తే..
తెలుగు భాష మీద మీకున్న పట్టు ఈ తరం కొత్త డైరెక్టర్లలో కనిపించలేదు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతోపాటు అన్ని క్రాఫ్ట్స్‌లలో అద్భుతంగా పని చేశారు. ముఖ్యంగా వివేక్ సాగర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీవిష్ణు వన్ మ్యాన్ షో అంటూ ఓ నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు.
The first movie of its kind from TFI🔥#Swag Will be remembered as one of the best writing ever @hasithgoli 👏👏
The way @sreevishnuoffl plays each role and varies from them reminds me of #KamalHaasan👌❤️❤️🙌
DON’T MISS IN THEATRES!#SwagTheFilm pic.twitter.com/h8l6AjpBEA
— 𝗛𝗔𝗥𝗜 (@iSmartHari_10) October 3, 2024
తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి సినిమా మొదటి సారి వచ్చింది. హసిత్ గోలి ఉత్తమ రచనలో ఒకటిగా స్వాగ్ నిలుస్తుంది. శ్రీవిష్ణు డిఫరెంట్ రోల్స్‌లో జీవించిన విధానం కమల్ హాసన్‌ను గుర్తుకు తెస్తుందని మరో యూజర్ రాసుకొచ్చాడు.
The first movie of its kind from TFI#Swag Will be remembered as one of the best writing ever @hasithgoli
The way @sreevishnuoffl plays each role and varies from them reminds me of #KamalHaasan
DON’T MISS IN THEATRES!#SwagTheFilm pic.twitter.com/h8l6AjpBEA
— 𝗛𝗔𝗥𝗜 (@iSmartHari_10) October 3, 2024
ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్టైన్ మెంట్ డోస్ బాగుంది. కానీ సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ ప్రజెంటేషన్ బాగుంది. లింగ సమానత్వం మీద క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశాన్ని ప్రశంసించాల్సిందే.
ఇక శ్రీవిష్ణు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించాడు. బోల్డ్ ఐడియాతో సినిమాను తెరకెక్కించిన హసిత్ గోలిని అభినందించాల్సిందే. సిల్వర్ స్క్రీన్‌పై శ్రీవిష్ణు సరికొత్త ప్రయత్నాన్ని ఓ సారి చూసేయొచ్చు.
శ్రీవిష్ణు తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. ప్రతీ క్షణం తన గ్రిప్‌లో ఉండేలా శ్రీవిష్ణు సాగుతుంది. అతని పాత్రను అర్థం చేసుకునే క్రమంలో ప్రేమ, ద్వేషం మధ్య నలిగిపోతారు ప్రేక్షకులు.
Just watched #SwagTheFilm – a bold new take on Telugu cinema! 🌟 @SreeVishnuOffl delivers a tour de force, navigating through humor and heart with seamless skill. The narrative’s fresh, the message strong, though pacing in the second half could’ve been tighter. A must-watch for… pic.twitter.com/QaYFJhuBWc
— Jaivardhan Singh Tomar (@jaitomar_review) October 4, 2024
తాజా కథనంతో బలమైన సందేశం, హృదయానికి హత్తుకునే హాస్యంతో సాగే సినిమా. వాస్తవాలకు దగ్గరగా ఉండేలా ప్రభావవంతమైన స్టోరీ టెల్లింగ్ కోసం తప్పక చూడవలసిన సినిమా ఇది.. అని ఓ మూవీ లవర్ ట్వీట్ చేశాడు.
ఓటీటీ రివ్యూస్ ప్లాట్‌ఫాం..
#SWAG : A wholesome film with high emotional drama with hilarious entertainment👌👏🏼#SreeVishnu and #HasithGoli bring another new age cinema to the screens offering a beautiful experience with first of its kind screenplay.
Pure one man show from @sreevishnuoffl and… pic.twitter.com/SXjgZbbSlw
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) October 3, 2024
మొదటి నుంచి చివరిదాకా గ్రిప్పింగ్ స్క్రిప్ట్ వర్క్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో హసిత్ గోలి సక్సెస్ అయ్యాడు. విప్లవ్ ఎడిటింగ్ వర్క్.. ప్రతీ సీన్‌ను ఎలివేట్ చేసేలా వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్.
ఎమోషనల్ డ్రామా ఎలిమెంట్స్‌తో ఛిల్గా సాగే వినోదాన్ని అందించే సినిమా. శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబోలో అందమైన అనుభూతిని సరికొత్త స్క్రీన్ ప్లేతో సాగే సినిమా.
శ్రీవిష్ణు వన్ మ్యాన్ షోలా స్వాగ్. మీరా జాస్మిన్ పాత్ర ఫ్రెష్ ఫీల్‌తో చాలా ప్రభావం చూపించేలా సాగుతుంది.
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3
Chiranjeevi | సినిమా వాళ్లను టార్గెట్ చేయడం సిగ్గుచేటు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై చిరంజీవి