Indian 3 | కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ పోషించిన చిత్రం ఇండియన్ 2 (Indian 2). శంకర్ (Shankar) దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా భారతీయుడు ప్రాంఛైజీలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. తమిళం, తెలుగుతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది.
ఇండియన్ 2 ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మేకర్స్ ఈ ప్రాంఛైజీలో రాబోతున్న ఇండియన్ 3ని థియేటర్లలో రిలీజ్ చేసే రిస్క్ చేయడానికి రెడీగా లేరని.. నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ వార్తలే నిజమయ్యాయి. ఇండియన్ 3 పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. 2025 జనవరిలో ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ కానుందని తెలియజేశారు. అయితే ఏ తేదీన స్ట్రీమింగ్ కానుందనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
అవినీతి, లంచం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఇండియన్ 2లో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రల్లో నటించారు. మరి ఇండియన్ 3లో మరి కొత్త యాక్టర్లెవరైనా జాయిన్ అయ్యారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.
#CinemaUpdate | இயக்குநர் ஷங்கரின் இந்தியன் 3 திரைப்படத்தை நேரடியாக ஓடிடி தளத்தில் வெளியிட படக்குழு முடிவு செய்திருப்பதாக தகவல் வெளியாகியுள்ளது!#SunNews | #Indian3 | #DirectOTT pic.twitter.com/x9WSPHjjFh
— Sun News (@sunnewstamil) October 3, 2024
Chiranjeevi | సినిమా వాళ్లను టార్గెట్ చేయడం సిగ్గుచేటు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై చిరంజీవి
Samantha | మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు : కొండా సురేఖ కామెంట్స్ పై సమంత