Kamadahanam | గిరిజన గ్రామాల్లో ఘనంగా కామదహనం
Kamadahanam | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఆదివాసీ గిరిజన గ్రామాల్లో హోలీ పండుగ సందర్భంగా సంప్రదాయ ప్రకారం కామదహనం నిర్వహించారు.
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ( Indravelli ) మండలం ఆదివాసీ గిరిజన గ్రామాల్లో హోలీ పండుగ సందర్భంగా సంప్రదాయ ప్రకారం కామదహనం ( Kamadahanam) నిర్వహించారు. సోమవారం మండలంలోని సమక, ఇంద్రవెల్లి, కెస్లాపూర్, హీరాపూర్, వడగాం, పోల్లుగూడ, వాల్గోండా, గట్టేపల్లి, దోడంద, ముత్నూర్, తుమ్మగూడ గ్రామాల్లో కామదహనం చేసి హాలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఆదివాసీ గిరిజన గ్రామంలో ప్రతి కుటుంబానికి చెందిన గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయ ఆచారం ప్రకారం ప్రతి ఒక్కరూ కుడకలు, చక్కెర బిల్లలా హారాలను తీసుకొని గ్రామపటేల్ ఇంటికీ చేరుకున్నారు. గ్రామపటేల్ ఇంటిముందర కొంతమంది ఆదివాసీ గిరిజన పెద్దలు కూర్చొని కుడకలు, చక్కెర బిల్లలా హారాలను సేకరించారు.
అనంతరం సేకరించిన కుడకలతోపాటు చక్కెర హారాలతో లెక్కల ప్రకారం గ్రామంలోని కుటుంబాల వివరాలు నమోదు చేశారు. మరికొందరు కలసి కామదేవతను వెదురు కర్రలతో మహతరి, మహాతారను తయారు చేశారు. సాయంత్రం గ్రామ పొలిమేరలో దహనం చేసి, వాయిద్యాలు వాయిస్తూ గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సమక గ్రామపటేల్ పెందూర్ భగవంతప్ప పటేల్, కోరెంగా యశ్వంత్రావ్, భీంరావ్, పోలుగూడ గ్రామస్తులు పోల్లుపటేల్, ఆత్రం శంకర్, జుగ్నాక్ కాశీరాం, జుగ్నాక్ భారత్, మర్చుకోల నాందేవ్, సాహెబ్రావ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

