Samantha | టాలీవుడ్ యాక్టర్లు నాగచైతన్య-సమంత (Samantha) నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే నాగార్జున కూడా స్పందిస్తూ.. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అని కోరాడు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండని సూచించాడు.
తాజాగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన ఆవేదనను అందరితో షేర్ చేసుకుంది సామ్. నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నా. ఇండస్ట్రీ మహిళలను చిన్నచూపు చూడటం మానేయండి. ఇలాంటి గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే చాలా శక్తి కావాలి. విడాకులు నా వ్యక్తి గత విషయం. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. నేనెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటా. మీరు గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నారు. మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు. మా విడాకుల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఇతర వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది.
Actress #Samantha‘s Statement over derogatory comments made by Ts Minister #KondaSurekha pic.twitter.com/5BgCSVsCjc
— Suresh PRO (@SureshPRO_) October 2, 2024
Mammootty | షూటింగ్ టైం.. లొకేషన్లో జైలర్ విలన్‌తో మమ్ముట్టి
Anushka Shetty | అనుష్క వెడ్డింగ్‌కు వేళాయె.. క్రేజీ వార్తలో నిజమెంత..?
Pooja hegde | విజయ్‌తో రొమాన్స్ వన్స్‌మోర్.. దళపతి 69 హీరోయిన్ ఫైనల్..!
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !