Mammootty | వయస్సుతో సంబంధం లేకుండా ఫుల్ ఎనర్జీగా వరుస సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు మాలీవుడ్ స్టార్ యాక్టర్ మమ్ముట్టి (Mammootty). ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం హోం ప్రొడక్షన్లో ఏడో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. జితిన్ కే జోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ చిత్రీకరణ తమిళనాడులోని నాగల్ కోయిల్‌లో మొదలైనట్టు ఇప్పటికే వార్త ఒకటి బయటకు వచ్చింది.
ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ మూవీలో జైలర్ ఫేం వినాయకన్ ( Vinayakan) కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మమ్ముట్టి సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని మమ్ముట్టి ఎక్స్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఫార్మల్ డ్రెస్‌లో వినాయకన్, చొక్కా, లుంగీలో మమ్ముట్టి చిరునవ్వులు చిందిస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మరోవైపు షూట్ లొకేషన్ ఫొటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ అండ్ వినాయకన్ టీం పూజా సెర్మనీ స్టిల్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ స్టార్ హీరో మరోవైపు గేమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న బజూక (Bazooka)లో కూడా నటిస్తున్నాడు. డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఎర్నాకులంలో జరుగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఓ లుక్బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న మమ్ముట్టి గడ్డంతో ఉన్న స్టైలిష్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ షైన్ ఛాకో, సుమిత్ నావల్, సిద్దార్ధ్ భరతన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మమ్ముట్టి నటిస్తోన్న Dominic and the Ladies Purse చిత్రీకరణ దశలో ఉంది.
లొకేషన్లో జైలర్ విలన్‌తో..
Joined the Sets of @MKampanyOffl Production No.7 at Nagercoil. pic.twitter.com/neLAitTpDl
— Mammootty (@mammukka) October 2, 2024
Mammootty Kampany Production No 07, Shoot Progressing At Nagercoil !!#Mammootty – Vinayakan- Jithin K Jose!! pic.twitter.com/adopzqMpgv
— 🄶🄺 (@FrinilF) October 1, 2024
Anushka Shetty | అనుష్క వెడ్డింగ్‌కు వేళాయె.. క్రేజీ వార్తలో నిజమెంత..?
Pooja hegde | విజయ్‌తో రొమాన్స్ వన్స్‌మోర్.. దళపతి 69 హీరోయిన్ ఫైనల్..!
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్