Anushka Shetty | అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది మంగళూరు భామ అనుష్కా శెట్టి (Anushka Shetty). ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఓ వైపు గ్లామరస్ పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. అరుంధతి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ భామ బాహుబలి ప్రాంఛైజీతో గ్లోబల్ స్టార్ డమ్ సంపాదించుకుంది.
బాహుబలి తర్వాత సినిమాలు తగ్గించిన స్వీటీ మరి పెండ్లి పీటలెక్కేదెప్పుడంటూ సోషల్ మీడియాలో చాలా కాలంగా చర్చ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా దీనికి సంబంధించిన వార్తే నెట్టింట రౌండప్ చేస్తోంది. ఈ భామ త్వరలోనే ఇక ప్రొఫెషనల్ లైఫ్‌కు బ్రేక్ ఇచ్చి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతుందట. తాజా టాక్ ప్రకారం అనుష్క దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుందట.
అనుష్క కుటుంబసభ్యులు ఈ సంబంధాన్ని కుదిర్చారని, తల్లిదండ్రుల పెండ్లి (Wedding) ప్రతిపాదనకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు కేవలం గాసిప్లాగే మిగిలిపోతాయా..? లేదంటే అధికారిక ప్రకటన ఏమైనా వస్తుందా..? అని చూడాలంటున్నారు సినీ జనాలు.
గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్క. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ భామ తెలుగులో Ghaati , మలయాళంలో కథనార్ సినిమాలో నటిస్తోంది.
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Matka | సూపర్ స్టైలిష్‌గా వరుణ్ తేజ్.. మట్కా రిలీజ్ అనౌన్స్మెంట్ లుక్ వైరల్
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్