Matka | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా చిత్రం మట్కా (Matka). పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ముందుగా ప్రకటించిన ప్రకారం రిలీజ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రాన్ని నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
వరుణ్ తేజ్ సూట్లో సూపర్ స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ.. మెట్లు దిగుతూ వస్తోన్న పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు పెంచేస్తుంది. రామోజీఫిలిం సిటీలో మట్కా ఫైనల్ షెడ్యూల్ కొనసాగుతున్నట్టు ఇటీవలే ఓ వార్తను షేర్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కథానుగుణంగా నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్.
మట్కాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. మట్కా కోసం మేకర్స్ ఇప్పటికే 1980 బ్యాక్‌డ్రాప్ వైజాగ్ లొకేషన్స్ రీక్రియేట్ చేయగా.. దీనికి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
GRAND RELEASE IN THEATRES ON NOVEMBER 14th, 2024 #MATKAonNOV14th #VarunTej #MegaPrince #MatkaKingVasu pic.twitter.com/dfvxBirpoj
— BA Raju’s Team (@baraju_SuperHit) October 1, 2024
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్