Sai Pallavi | టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి తండేల్ (Thandel). అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తుండగా.. సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. NC23 ప్రాజెక్టుగా రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న తండేల్ షూటింగ్ దశలో ఉంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతూ.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
తండేల్‌లో శివరాత్రి థీమ్ పాట కోసం మేకర్స్ భారీ సెట్ వేశారు. పాట విజువల్ ట్రీట్‌లా ఉండేందుకు మేకర్స్ రూ.4 కోట్లు ఖర్చు చేశారని ఇన్సైడ్ టాక్. అంతేకాదు వేలాది మంది డ్యాన్సర్లు ఈ పాటలో భాగం కాబోతున్నారట. ఇప్పటికే లవ్‌స్టోరీతో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన సాయిపల్లవి, నాగచైతన్య శివపార్వతులను తలపించే నృత్యరీతులతో అలరించబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. శివరాత్రి థీమ్‌తో ఓ పాటను ఈ స్థాయిలో కంపోజ్ చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారి అని ట్రేడ్ సర్కిల్ టాక్. మొత్తానికి తండేల్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పేందుకు ఈ ఒక్క అప్డేట్ చాలనడంలో ఎలాంటి సందేహం లేదు.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న తండేల్‌ను చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు తెరకెక్కిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే తండేల్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయి సత్య పాత్రలో కనిపించనుంది.
Ram Charan | రాంచరణ్ అభిమానులకు ఐఫా టీం గుడ్‌న్యూస్.. ఇంతకీ ఏంటో తెలుసా..?
Zebra | సత్యదేవ్‌కు సపోర్ట్‌గా నాని.. జీబ్రా టీజర్ టైం చెప్పేశారు
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!