Ram Charan | ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్‌వైడ్‌గా అభిమానులను సంపాదించుకున్నాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan). ఈ స్టార్ హీరో ప్రస్తుతం గేమ్ ఛేంజర్, ఆర్సీ 16 సినిమాల్లో నటిస్తోండగా.. గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా మెగా అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రాంచరణ్ మైనపు విగ్రహం (Wax Statue) సందడి చేయనుంది. యూఏఈ రాజధాని అబుదాబిలో అంగరంగా వైభవంగా జరుగుతున్న ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుకల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాంచరణ్ పెట్ రైమ్ మైనపు విగ్రహం కూడా మ్యూజియంలో సందడి చేయనుండటం విశేషం. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేసిన ఐఫా టీం.. ఇంతకీ లాంఛ్ డేట్ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి రాంచరణ్‌తోపాటు పెట్ రైమ్ మైనపు విగ్రహం కూడా రెడీ అవుతుండటం అభిమానులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.
శంకర్ డైరెక్షన్లో రాబోతున్న గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బుచ్చి బాబు సాన డైరెక్షన్లో రాబోతున్న ఆర్సీ 16 స్పో్ర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
RamCharan Wax Statue to be unveiled at MadameTussauds Very Soon ! ..Announced at IIFA2024#RamCharan #IIFA2024 #Rhyme pic.twitter.com/VCndl84bSK
— suzen (@Suzenbabu) September 29, 2024
Zebra | సత్యదేవ్‌కు సపోర్ట్‌గా నాని.. జీబ్రా టీజర్ టైం చెప్పేశారు
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?