కట్టంగూర్, మార్చి 4 : స్వాతంత్ర్య సమరయోధుడు గోదల పద్మారెడ్డి(పద్మన్న) 34వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం కట్టంగూర్ మండలంలోని పందనపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పద్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులు, వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ గద్దపాటి వీరేందర్. గోదల కృష్ణారెడ్డి, గోదల అంజిరెడ్డి, కల్కూరి లక్ష్మమ్మ, బంగారు ఊర్మిలమ్మ, మల్లమ్మ, గజ్జి లక్ష్మయ్య, బట్టు ముత్తయ్య, సంకటి నర్సింహ్మ, కృష్ణారెడ్డి. నంద్యాల శేఖర్ రెడ్డి, గద్దపాటి వసుమతి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ఊట్కూరి లింగయ్య, కుమ్మరి యాదయ్య, నిమ్మనగోటి వెంకన్న పాల్గొన్నారు.