సింగరేణి కోరలే.. మేం నిధులివ్వలే!
తెలంగాణలోని సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని ఎటువంటి ఆర్థిక సహాయాన్ని లేదా అనుమతులు కోరనందునే, ఆ సంస్థకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదా ఆమోదించడం జరుగలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి వెల్లడించారు.
- ఆర్థిక సాయం కోరనందునే కేంద్రం ఎలాంటి కేటాయింపులు చేయలేదు
- గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల కోసం 46వేల కోట్ల నిధులతో ప్రోత్సాహక పథకాలు
- రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం
హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని ఎటువంటి ఆర్థిక సహాయాన్ని లేదా అనుమతులు కోరనందునే, ఆ సంస్థకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదా ఆమోదించడం జరుగలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నలకు సోమవారం ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్లాంట్ ఏర్పాటు కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) అనుమతులు లేదా ఆర్థికసాయం కోరిందా? అన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు సంబంధించి సింగరేణి నుంచి ఎలాంటి ప్రతిపాదన తమ శాఖకు అందలేదని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక ప్రోత్సాహక పథకాల ప్రయోజనాలు.. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు, ప్రతిపాదనలు పంపిన వారిలో అర్హులకు అందుబాటులో ఉంటాయని స్పష్టంచేశారు. సింగరేణి సంస్థ నుంచి త మకు ఎలాంటి ఆభ్యర్థనలు, ప్రతిపాదన లు రానందునే వాటి కి నిధులు మంజూరు చేయలేదని మంత్రి తెలిపారు. సవాళ్లను ఎదురొనే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందిస్తూ మద్దతుగా నిలుస్తున్నదని తెలిపారు.
ఎంఎస్ఎంఈలపై మంత్రి శోభా కరంద్లాజే వివరణ
తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) పూర్తిస్థాయిలో మద్దతు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తున్నదని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే వెల్లడించారు. రాజ్యసభలో వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నలకు ఆమె సోమవారం రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. తెలంగాణలోని ఎంఎస్ఎంఈ రంగానికి నిరుడు అందించిన నిర్దిష్ట మద్దతు పథకాలు, కేటాయించిన ఆర్థిక సాయం, గ్రాంట్ల వివరాలు తెలుపాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు.
ఆయన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. స్వయం ఉపాధి, నూతన చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు ఆర్థిక చేయూతనిస్తున్నామని, క్రెడిట్ గ్యారెంటీ పథకంతో సంస్థాగత పూచీకత్తు లే కుండా బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పీఎం విశ్వకర్మ పథకం లో భాగంగా సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఆర్థిక మద్దతు, ఆధునిక పరికరాల పంపిణీ చేస్తున్నామని వివరించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ ద్వారా ఆయా వర్గాల వ్యాపారవేత్తలకు చేయూతనిస్తున్నామని తెలిపారు.
శివశంకర్ సేవలు చిరస్మరణీయం: వద్దిరాజు
కేంద్ర మాజీ మంత్రి దివంగత శివశంకర్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. శివశంకర్ 97వ జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన శివశంకర్.. న్యాయవాదిగా, కేంద్ర మంత్రిగా దేశానికి విశేష సేవలందించారని తెలిపారు. న్యాయం, విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రిగా, ఆర్థిక సంఘం చైర్మన్ గా, కేరళ, సికిం రా ష్ట్రాల గవర్నర్‌గా ఆయన విశేష సేవలందించారని పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్లు సాధించడంలో శివశంకర్ కీ లక పాత్ర పోషించారని గుర్తుచేసుకొన్నారు. పేదల హకులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

