సొంత జిల్లాపై సోయిలేని రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సొంత జిల్లాపైన సోయి లేదని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లు కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడంపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం ప్రకటనలో తీవ్రంగా ఖం డించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైందన్నారు.
- పీఆర్ఎల్ఐ డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపడంపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆగ్రహం
మహబూబ్‌నగర్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సొంత జిల్లాపైన సోయి లేదని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లు కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడంపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం ప్రకటనలో తీవ్రంగా ఖం డించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైందన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఆర్ఎల్ఐ ఎత్తిపోతల డీపీఆర్ వెనక్కి తిప్పి పంపడం దుర్మార్గం అన్నారు. రెండు జాతీయ పార్టీలు పాలమూరు జిల్లాకు అన్యాయం చేయడమే పనిగా పెట్టుకున్నాయనీ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన పదహారు మంది ఎంపీల వల్ల తెలంగాణకు ప్రయోజనం లేదని మరోసారి రుజువైందన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్, బీజేపీ కలిసి ఏపీకి దోచి పెడుతున్నాయనీ
ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి గురువు చంద్రబాబు ఏజెండా అమలు చేస్తున్నారు. ఉ మ్మడి రాష్ట్రంలో పాలమూ రు జిల్లాను వలసల జిల్లాగా మా ర్చిన కాంగ్రె స్ .. మరోసారి తీరని అన్యా యం చేస్తుంది. చం ద్రబాబు కోసం బీజేపీ తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తుందనీ విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తామని ప్రధాని మోదీ 2014లో హామీ ఇచ్చి మోసం చేశారని గుర్తు చేశారు. మోదీకి తెలంగాణ అం టేనే ద్వేషం.. చివరికి డీపీఆర్ కూడా వెనక్కి పంపారని పక్క రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు ఎందు కు ఇవ్వరు? అని ప్రశ్నించారు. అక్కడ లేని అభ్యంతరం తెలంగాణ ప్రాజెక్టుల మీదే ఎందుకు? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపట్టి 90 శాతం పూర్తి చేయడంతో పాటు, ఒకటి రెండు మినహా అన్ని రకాల అనుమతులు సాధించామన్నా రు. కేంద్ర ప్రభుత్వం వెంటనే డీపీఆర్ ఆమో దించాలని డిమాండ్ చేస్తు న్నామన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

