Imran Khan | ఇమ్రాన్‌ఖాన్ సోదరి అలీమా ఖాన్ అరెస్ట్.. లాహోర్ జైలుకు తరలింపు
Imran Khan : పాకిస్తాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్‌ను లాహోర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలుకు తరలించారు.
Imran Khan : పాకిస్తాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్‌ను లాహోర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలుకు తరలించారు. లాహోర్‌లోని తన నివాసం నుంచి అలీమా ఖాన్‌ను స్థానిక పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె కారును, డ్రైవర్‌ను మజాంగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలీమా ఖాన్‌ను సెక్షన్ 3, ఎంపీఓ (మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్) కింద పోలీసులు అరెస్టు చేశారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నవారిని ముందస్తుగా ఈ చట్టం కింద అరెస్టు చేస్తారు. అయితే, ఆమెను అరెస్టు చేయడానికి గల అసలైన కారణాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. అలీమా ఖాన్ సోదరుడు ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాక్‌లోని రావల్పిండి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, పాక్ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్‌ను 2022 నుంచి జైలులో ఉంచారు. ఆయనకు జైలులో సరైన చికిత్స కూడా అందడం లేదనే ఆరోపణలున్నాయి. ఇటీవల కోర్టు ఆర్డర్ రావడంతో ఇమ్రాన్ ఖాన్‌ను జైలు అధికారులు ఒక రోజు మాత్రమే ఆస్పత్రికి తరలించారు.
ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్‌ను అలీమా ఖాన్ కలిశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే అలీమా ఖాన్‌ను పాక్ పోలీసులు అరెస్టు చేయడం విశేషం. మరోవైపు ఇమ్రాన్ ఖాన్‌కు రావల్పిండిలోని అడియాలా జైలులో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)కు చెందిన వైద్య బృందం ఈ పరీక్షలు ఇటీవల నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థితికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

