LK Advani | ఎల్కే అద్వానీ, మనీష్ సిసోడియాకు సర్ నోటీసులు.. పలువురు ప్రముఖులకు కూడా
LK Advani భారత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎన్నికల సంఘం సర్ నోటీసులు జారీ అయ్యాయి. ఢిల్లీలో మొత్తం 33 లక్షల మందికి సర్ నోటీసులు జారీ కాగా వారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు.
LK Advani భారత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎన్నికల సంఘం సర్ నోటీసులు జారీ అయ్యాయి. ఓటరు లిస్టుకు సంబంధించి సరైన వివరాలు లేని కారణంగా సర్ నోటీసులు జారీ అయ్యాయి. ఢిల్లీలో మొత్తం 33 లక్షల మందికి సర్ నోటీసులు జారీ కాగా వారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వీరి ప్రస్తుత ఓటరు వివరాలు సర్ 2002తో మ్యాపింగ్ కుదరకపోవడంతో ఈసీ నోటీసులు జారీ చేసింది.
ఎల్కే అద్వానీతోపాటు ఆయన కుమార్తె ప్రతిభ, కోడలు గీతికకు కూడా సర్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే, అద్వానీ కుమారుడు జయంత్‌కు మాత్రం ఎలాంటి నోటీసులు జారీ కాలేదు. అద్వానీ కుటుంబానికి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఓట్లున్నాయి. అలాగే, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులకు కూడా సర్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రక్రియపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. తాజాగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆయన భార్య సీమ, కుమారుడు మీర్‌కు కూడా సర్ నోటీసులు వచ్చాయి.
అలాగే, కేంద్ర మంత్రి జైశంకర్, ఆయన భార్య క్యోకో జైశంకర్‌కు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. వీరికి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని సుందర్బాగ్లో ఓటు హక్కు ఉంది. వీరితోపాటు ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్య సునీతా ద్వివేది, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, ఆయన భార్య షెబా బ్రిట్టాస్, కుమారుడు ఆనంద్ బ్రిట్టాస్‌కు కూడా సర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసుల ప్రకారం సంబంధిత వ్యక్తులు తగిన ధృవపత్రాలు నిర్ణీత గడువులోగా సమర్పించి, తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించుకోవాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

