Unstoppable With NBK | టాలీవుడ్ హీరో బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరించిన టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK). ఇప్పటికే సీజన్ 1, సీజన్ 2 సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాయి. తాజాగా రెట్టించిన ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కొత్త సీజన్ ( సీజన్ 3)తో రెడీ అవుతున్నాడు బాలకృష్ణ.
సీజన్ 1, 2లో పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సందడి చేసిన బాలయ్య మూడో సీజన్‌తో కూడా స్టార్ సెలబ్రిటీలతో వినోదాన్ని అందించేందుకు సిద్దమవుతున్నాడన్న వార్త ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తోంది. నయా సీజన్ 3 తొలి అతిథిగా మాలీవుడ్ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ రాబోతున్నాడని ఇన్సైడ్ టాక్.
లక్కీ భాస్కర్ దీపావళికి విడుదలవుతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగా దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత సూర్య దేవర నాగవంశి కూడా షోలో జాయిన్ కాబోతున్నారట. బాలకృష్ణ అండ్ టీంపై వచ్చే ఈ ఎపిసోడ్‌ను నేడు హైదరాబాద్‌లో షూట్ చేశారని సమాచారం. దసరా కానుకగా స్పెషల్ ట్రీట్ అందిస్తూ.. ఎపిసోడ్‌ను విడుదల చేయబోతున్నారని సమాచారం.
#UnstoppableWithNBK Next Season First Episode shoot today at Hyd🔥🥰
Full Fun and Entertainment Loading from this Dussera 🕺
Baap of All Talkshows 🤙🤙#NandamuriBalakrishna #JaiBalayya pic.twitter.com/6hYAUAHGm3
— manabalayya.com (@manabalayya) September 30, 2024
Kamal Haasan | సల్మాన్ ఖాన్, అట్లీ సినిమాకు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Kannappa | పిలక-గిలకగా సప్తగిరి, బ్రహ్మానందం.. మంచు విష్ణు కన్నప్ప నయా లుక్ వైరల్