Saripodhaa Sanivaaram | న్యాచురల్ స్టార్ నాని (Nani) ఇటీవలే సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లు రాబట్టింది. కాగా ఓ వైపు ఈ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు కొత్త సినిమాల షూటింగ్స్‌తో బిజీగా మారిపోయాడు నాని. కాగా థియేటర్లలో అందరినీ ఇంప్రెస్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిందని తెలిసిందే.
ముందుగా ఊహించినట్టుగానే సరిపోదా శనివారం డిజిటల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. సినిమాను థియేటర్లలో మిస్సయిన మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని తాజా వార్త క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మేకర్స్ ఇటీవలే సరిపోదా శనివారం నుంచి జేక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన (ఓఎస్టీ) ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని 31గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయగా.. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో విడుదల చేశారు. ఈ మూవీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా.. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటించాడు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు.
♥️#SaripodhaaSanivaaram @netflix pic.twitter.com/hRmaqULHpI
— Nani (@NameisNani) September 29, 2024
Ram Charan | రాంచరణ్ అభిమానులకు ఐఫా టీం గుడ్‌న్యూస్.. ఇంతకీ ఏంటో తెలుసా..?
Zebra | సత్యదేవ్‌కు సపోర్ట్‌గా నాని.. జీబ్రా టీజర్ టైం చెప్పేశారు
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!