Kamal Haasan | జవాన్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee). ఈ లీడింగ్ డైరెక్టర్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో (Salman Khan)తో మల్టీ స్టారర్ చేయబోతున్నట్టు ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత మరో క్రేజీ వార్త తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో ఉలగనాయగన్ కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని జోరుగా టాక్ నడుస్తోంది. అట్లీ 6 ప్రాజెక్ట్ చర్చలు తుదిదశలో ఉన్నాయని కోలీవుడ్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
కాగా అట్లీ ప్రస్తుతం కమల్ హాసన్‌తో చర్చలు జరుపుతున్నాడట. కథానుగుణంగా డ్యుయల్ హీరో సబ్జెక్ట్ అని.. పక్కా పాన్ ఇండియా అప్పీల్‌తో సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ దాదాపు ఫైనల్ కాగా.. మరో లీడ్ రోల్‌కు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. జవాన్ తర్వాత అట్లీ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
కమల్ హాసన ప్రస్తుతం ఇండియన్ 3, థగ్ లైఫ్, కల్కి 2898 ఏడీ సీక్వెల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. శంకర్ డైరెక్షన్లో ఇండియన్ 3 తెరకెక్కుతోంది. మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కుతున్న థగ్ లైఫ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు , ఐశ్వర్యలక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
#Atlee6 – With being #SalmanKhan almost confirmed for #Atlee‘s next movie, he has been in Final talks with Ulaganayagan #KamalHaasan to rope in for the movie, as it’s duel hero Subject 🌟🌟
Going to be a Proper Mega Pan Indian reunion 🔥
An Anirudh Musical 🎶 pic.twitter.com/KRRWEFLypP— AmuthaBharathi (@CinemaWithAB) September 30, 2024
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!