Hari Hara Veera Mallu | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ విజయవాడలో షురూ అయిన విషయం తెలిసిందే. పవన్ ఓ వైపు డిప్యూటీ సీఎంగా తన విధులను చూసుకుంటూనే.. మరోవైపు బ్రేక్ టైంలో షూట్లో పాల్గొంటున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
కాగా తాజా టాక్ ప్రకారం నిధి అగర్వాల్ ఇవాళ ఉదయమే విజయవాడలో ల్యాండైంది. నిధి అగర్వాల్ ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో జాయిన్ అయినట్టు సమాచారం. తాజా షెడ్యూల్లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. కొన్ని రోజులుగా హాలీవుడ్ లెజెండరీ స్టంట్ డైరెక్టర్ నిక్ పవెల్ పర్యవేక్షణలో యుద్ద వీరుడు హరిహరవీరమల్లు అండ్ టీంపై వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
హరి హర వీరమల్లులో బీటౌన్ యాక్టర్ బాబీడియోల్ కీలక పాత్రలో నటిస్తోండగా.. బాలీవుడ్ దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, నాజర్, సునీల్ రఘుబాబు, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.మేఘ సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దయాకర్‌రావు నిర్మిస్తున్నారు.
Kamal Haasan | సల్మాన్ ఖాన్, అట్లీ సినిమాకు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Kannappa | పిలక-గిలకగా సప్తగిరి, బ్రహ్మానందం.. మంచు విష్ణు కన్నప్ప నయా లుక్ వైరల్