హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై పలువురు బీఆర్ఎస్ సభ్యులు ఆక్షేపించారు. అధికారపక్షం వైపు కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘మీరంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా. మా వైపు రండి. ప్రతిపక్షంలో కూర్చోండి’ అంటూ సూచించారు. ఇందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి స్పందన లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు రుజువులు లేవని స్పీకర్ పేర్కొన్న నేపథ్యంలో ప్రతిపక్షం వైపు కూర్చోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు.