Pooja hegde | ఇటీవలే ది గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay). ఈ స్టార్ యాక్టర్ నెక్ట్స్ దళపతి 69 (Thalapathy 69) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దళపతి 69 అప్డేట్ ఇస్తూ.. విజయ్ సినిమాటిక్ జర్నీతో డిజైన్ చేసిన వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు కనిపించబోతున్నారనే దానిపై ఏదో ఒక వార్త ఆన్లైన్లో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా మేకర్స్ హీరోయిన్ను ఫైనల్ చేసినట్టు అప్డేట్ అందించారు. విజయ్‌తో పూజాహెగ్డే రొమాన్స్ చేయనుంది. విజయ్ చివరి సినిమాలో బీస్ట్ తర్వాత పూజాహెగ్డే మరోసారి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.
బీస్ట్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై అదిరిపోయే ట్రీట్ అందించిన ఈ ఇద్దరు స్టార్ యాక్టర్లు మరో సినిమా చేయబోతున్నారని తెలియడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 2025 అక్టోబర్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్టైనర్గా రాబోతుంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఇదే చివరి మూవీ కానుందని తెలిసిందే. ఈ చిత్రం కాప్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని.. మరోసారి విజయ్ పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తోండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
THALAPATHY VIJAY’S FINAL CHAPTER IN CINEMA: POOJA HEGDE JOINS THIS MEGA-VENTURE… After delivering a massive hit with #Beast, #PoojaHegde will once again star opposite #ThalapathyVijay in his 69th film [#Thalapathy69].
Produced by #VenkatKNarayana [KVN Productions] and directed… pic.twitter.com/1umINCZFWI
— taran adarsh (@taran_adarsh) October 2, 2024
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Matka | సూపర్ స్టైలిష్‌గా వరుణ్ తేజ్.. మట్కా రిలీజ్ అనౌన్స్మెంట్ లుక్ వైరల్
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్