KHxRK | 90స్ ఫిల్మ్‌మేకింగ్.. రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ కోసం నెల్సన్ దిలీప్ కుమార్ క్రేజీ ప్లాన్..!
KHxRK | లెజెండరీ యాక్టర్లు కమల్ హాసన్, రజనీకాంత్ క్రేజీ మల్టీస్టారర్ ‘KHxRK’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘జైలర్’ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది.
KHxRK | లెజెండరీ యాక్టర్లు కమల్ హాసన్, రజనీకాంత్ సుమారు 46 ఏళ్ల తర్వాత కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఈ క్రేజీ మల్టీస్టారర్ స్పెషల్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ‘KHxRK’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘జైలర్’ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. ఈ సినిమా కోసం 90స్ ఫిల్మ్ మేకింగ్ మెథడ్‌ను ఫాలో అవ్వనున్నాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.
తాజా టాక్ ప్రకారం ఈ మూవీని 80స్, 90స్లో ఉపయోగించిన ఫిల్మ్ కెమెరాలతో షూట్ చేయనున్నారట. నెల్సన్, రాజీవ్ మీనన్ ఇప్పటికే ప్రోమోను ఇదే పద్దతిలో షూట్ చేయాలనుకున్నా.. టైం తక్కువగా ఉండటం వల్ల డిజిటల్ మెథడ్‌లో ప్రోమోను తెరకెక్కించారని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే మళ్లీ 90స్ కాలం నాటి మూవీ వైబ్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయొచ్చన్నమాట. నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ వర్కవుట్ అయితే బాక్సాఫీస్ వద్ద కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టినట్టు కాబోతుందని తెగ చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. మొత్తానికి నెల్సన్ దిలీప్ కుమార్ లెజెండరీ యాక్టర్లతో గట్టి ప్లానే సెట్ చేశాడని అంతా అనుకుంటున్నారు.
గ్లింప్స్‌లో కమల్-రజనీ ఇద్దరూ ఎవరు స్టైల్లో వారు కనిపిస్తూ.. కాస్ట్యూమ్స్, బూట్లు, బెల్ట్, వాచ్, కళ్లద్దాలతో ఒకరినొకరు డామినేట్ చేసుకునేలా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. కమల్–రజనీ రీయూనియన్ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఖచ్చితంగా అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి. మరి నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరితో ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
Back to 90’s method of Film making 😲❓
As per Touring Talkies, #KHxRK – Ulaganayagan #KamalHaasan & Superstar #Rajinikanth Reunion film is going to be shoot in Film Camera, where the films back from 90’s, 80’s and so on shoot using that🤞
Nelson & RajivMenon in fact tried to… pic.twitter.com/d54KLadbf2
— AmuthaBharathi (@CinemaWithAB) March 2, 2026
Read Also :
Toxic | యష్ ‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ రిలీజ్.. ఆడియోతోనే అంచనాలు రెట్టింపు!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

