Konda Surekha | టాలీవుడ్ నటి సమంత (Samantha)పై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సామ్ విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సమంతకు పలువురు మద్దతుగా నిలిచారు.ఈ కామెంట్స్‌పై టాలీవుడ్ సెలబ్రిటీలు చిరంజీవి, నాని, వెంకటేశ్, మంచు లక్ష్మి, సుధీర్ బాబు, శ్రీకాంత్ ఓదెలతోపాటు పలువురు స్పందించారు. వారి మాటల్లోనే..
సినీ పరిశ్రమకు చెప్పాలి : ఖుష్బూ సుందర్
సినీ పరిశ్రమ ఇలాంటి వేధింపులను సహించదు..చాలు. మీరు ఓ మహిళగా ఉండి.. మరొక మహిళపై ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసినందుకు మొత్తం సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు.. కానీ మేము మీ స్థాయికి దిగజారలేము.
మరింత దిగజార్చవద్దు : సుధీర్ బాబు
మంత్రి కొండా సురేఖ గారూ మీ నీచమైన, స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. సినీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవడం మీ నిరాశను తెలియజేస్తుంది. మీరు కేవలం మహిళలను మాత్రమే అవమానించడం కాదు.. తెలంగాణకు గర్వకారణమైన మొత్తం పరిశ్రమను అగౌరవపరిచారు. మీ కీర్తి ఇప్పటికే దెబ్బితిన్నది. దానిని మరింత దిగజార్చవద్దు.
ఆయుధంగా మార్చడం దురదృష్టకరం: వెంకటేశ్
వ్యక్తిగత పరిస్థితులను రాజకీయ మందుగుండులా వాడుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారి వ్యక్తిగత విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం ఆయుధంగా మార్చడం దురదృష్టకరం. పబ్లిక్‌గా మాట్లాడేటప్పుడు గౌరవాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. వ్యక్తిగత జీవితాలను రాజకీయ రంగంలోకి లాగడం ఎవరికీ ఉపయోగం ఉండదు. అలా చేసిన వారికి బాధను మాత్రమే మిగులుస్తుంది. ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం పాటిస్తూ.. సానుభూతి చూపించాలని కోరుతున్నా.
మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మా తెలివితక్కువ పని..: నాని
రాజకీయ నాయకులు ఎలాంటి అవాకులు చెవాకులు మాట్లాడినా తప్పించుకోవచ్చని అనుకోవడం చూస్తే అసహ్యం వేస్తుంది. మీ మాటలు చాలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు.. మీకు మీ ప్రజల పట్ల ఏదైనా బాధ్యత ఉంటుందని ఆశించడం మా తెలివితక్కువ పని. ఇది కేవలం యాక్టర్లు, సినిమా గురించి కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన కామెంట్స్ చేయడం సరైంది కాదు. మన సమాజాన్ని చెడుగా ప్రతిబింబించే ఇలాంటి ఆచారాన్ని మనందరం ఖండించాలి.
సురేఖ గారు మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాదు : దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల..
రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా. 365 డేస్ ప్రతిరోజు సమంత మేడంను దగ్గరగా చూసిన ఒక అభిమానిగా చెప్తున్నా. సమంత మేడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన వరం. ఒక ఆర్టిస్ట్ గానే కాదు.. ఒక వ్యక్తిగా కూడా తను మా ఇంట్లో అక్కల అనిపించేవారు. నాకు సురేఖ గారి గురించి కానీ, సమంత మేడం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు.. కానీ సురేఖ గారు మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాదు.
సినీ సోదరుల సభ్యులను టార్గెట్ చేయడం సిగ్గు చేటు.. : చిరంజీవి
సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, సినీ సోదరుల సభ్యులను టార్గెట్ చేయడం సిగ్గు చేటు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపూరిత మాటల దాడులను చిత్రపరిశ్రమ తరపున అంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తాం. సంబంధం లేని వ్యక్తులను, ప్రత్యేకించి మహిళలను తమ రాజకీయ వ్యవహారాల్లోకి లాగడం, అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేసేలా.. రాజకీయ నేతలు ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదు.
So bloody unfortunate to hear such disgusting comments especially from a person in a respectable position. This shows that power and position can’t buy you dignity.
రంగస్థలం సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా 365 డేస్ ప్రతిరోజు సమంత మేడం ని దెగ్గరగా చుసిన ఒక అభిమాని గ…
— Srikanth Odela (@odela_srikanth) October 2, 2024
Disgusting to see politicians thinking that they can get away talking any kind of nonsense. When your words can be so irresponsible it’s stupid of us to expect that you will have any responsibility for your people. It’s not just about actors or cinema. This is not abt any…
— Nani (@NameisNani) October 2, 2024
I thought it was only those who need 2 minute fame and indulge in yellow journalism speak this language. But here, I see an absolute disgrace to womanhood. Konda Surekha garu, I am sure some values were instilled in you. Where have they flown out of the window? A person in a…
— KhushbuSundar (@khushsundar) October 2, 2024
Minister Konda Surekha garu, your vile and misogynistic comments are appalling. Using cinema personalities as political pawns only showcases your desperation. Our fraternity won’t be intimidated or bullied by your cheap tactics. You’re not just insulting women, you’re…
— Sudheer Babu (@isudheerbabu) October 3, 2024
I am extremely pained to see the disgraceful remarks made by an honourable woman minister.
It is a shame that celebs and members of film fraternity become soft targets as they provide instant reach and attention. We as Film Industry stand united in opposing such vicious verbal…
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 3, 2024
It’s so disheartening that every time a politician craves attention, they throw a bunch of actors under the bus. It’s infuriating ! And when something terrible happens in the state, they expect actors to stand behind them, pushing a political agenda. How is this fair? Why are we…
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) October 3, 2024
Dragging personal lives into political discourse is crossing a line, Konda Surekha garu as a public servant and minister of the state. Leaders in responsible positions must have respect and privacy towards others personals. Careless, baseless remarks, especially aimed at the film…
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) October 3, 2024
Chiranjeevi | సినిమా వాళ్లను టార్గెట్ చేయడం సిగ్గుచేటు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై చిరంజీవి
Samantha | మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు : కొండా సురేఖ కామెంట్స్ పై సమంత
Chinmayi Sripada | సమంత అందరికంటే ఉన్నతమైన వ్యక్తి : సింగర్ చిన్మయి
Jani Master | జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్.. ఎన్ని రోజులంటే..?