Chiranjeevi | సినిమా వాళ్లను టార్గెట్ చేయడం సిగ్గుచేటు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై చిరంజీవి
Chiranjeevi | టాలీవుడ్ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సామ్ విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సమంతకు పలువురు మద్దతుగా నిలిచారు.ఈ కామెంట్స్‌పై తాజాగా స్టార్ యాక్టర్ చిరంజీవి స్పందించాడు.
Chiranjeevi | టాలీవుడ్ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సామ్ విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సమంతకు పలువురు మద్దతుగా నిలిచారు.ఈ కామెంట్స్‌పై తాజాగా స్టార్ యాక్టర్ చిరంజీవి స్పందించాడు. గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డా. అందరి అటెన్షన్ తమవైపు తిప్పుకునేందుకు
సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, సినీ సోదరుల సభ్యులను టార్గెట్ చేయడం సిగ్గు చేటు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపూరిత మాటల దాడులను చిత్రపరిశ్రమ తరపున అంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తాం. సంబంధం లేని వ్యక్తులను, ప్రత్యేకించి మహిళలను తమ రాజకీయ వ్యవహారాల్లోకి లాగడం, అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేసేలా.. రాజకీయ నేతలు ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదు.
సమాజ జీవన ప్రమాణాలను ఉత్తమంగా ముందుకు సాగేందుకు మన నాయకులను ఎన్నుకుంటాము. వారు స్థాయిని తగ్గించేలా మాట్లాడకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు స్పూర్తిదాయకంగా మంచి ఉదాహరణగా ఉండాలి. ఈ వివాదానికి కారణమైన వ్యక్తులు సవరణలు చేసుకుని.. హానికలిగించే వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటారని విశ్వసిస్తున్నానని సుదీర్ఘ సందేశాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు చిరంజీవి.
కాగా వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించారని తెలిసిందే. మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. మీ మనోభావాలు దెబ్బతీయాలని తన ఉద్దేశం కాదని తెలిపారు. స్వయంశక్తితో మీరు ఎదిగిన తీరు తనకు ఆదర్శం. మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని.. అన్యదా భావించకూడదని మంత్రి కొండా సురేఖ ఇప్పటికే ఎక్స్ వేదికగా నటి సమంతకు ట్వీట్ చేశారు.
I am extremely pained to see the disgraceful remarks made by an honourable woman minister.
It is a shame that celebs and members of film fraternity become soft targets as they provide instant reach and attention. We as Film Industry stand united in opposing such vicious verbal…
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 3, 2024
Read Also :
Samantha | మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు : కొండా సురేఖ కామెంట్స్ పై సమంత
Chinmayi Sripada | సమంత అందరికంటే ఉన్నతమైన వ్యక్తి : సింగర్ చిన్మయి
Anushka Shetty | అనుష్క వెడ్డింగ్‌కు వేళాయె.. క్రేజీ వార్తలో నిజమెంత..?
Pooja hegde | విజయ్‌తో రొమాన్స్ వన్స్‌మోర్.. దళపతి 69 హీరోయిన్ ఫైనల్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

