Jani Master | డ్యాన్సర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master)అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే రంగారెడ్డి కోర్టు జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. తాజాగా జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ అవార్డు తీసుకునేందుకు కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది.
అంతకుముందు జానీ మాస్టర్ బెయిల్‌పై నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫ్టాస్ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టులో కౌంటర్ దాఖలు చేశారని తెలిసిందే. కొరియోగ్రాఫర్‌కి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కేసు విచారణ దశలో ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు విచారణను వాయిదా వేసింది.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగికంగా వేధించినట్లు ఆరోపణల్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Samantha | మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు : కొండా సురేఖ కామెంట్స్ పై సమంత
Chinmayi Sripada | సమంత అందరికంటే ఉన్నతమైన వ్యక్తి : సింగర్ చిన్మయి
Anushka Shetty | అనుష్క వెడ్డింగ్‌కు వేళాయె.. క్రేజీ వార్తలో నిజమెంత..?
Pooja hegde | విజయ్‌తో రొమాన్స్ వన్స్‌మోర్.. దళపతి 69 హీరోయిన్ ఫైనల్..!